ముఫాస మూవీ డబ్బింగ్ అనుభవాన్ని పంచుకున్న మహేష్ బాబు..! 3 d ago
ముఫాస ది లయన్ కింగ్ మూవీ లో ముఫాస పాత్రకు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మూవీ రేపు విడుదల కానున్న సందర్భంగా దీనికి సంబంధించిన పోస్టర్ను మహేష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అందులో "నా మనసుకు చాల దగ్గరైన ముఫాస పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఒక అద్భుతమైన అనుభవం, మూవీ చూసి నేను ఆనందించినట్లు మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.